After2038.org
తండ్రియైన దేవుడిని, కుమారుడైన యేసుక్రీస్తును ఎలా అర్ధం చేసుకోవాలి?
హెబ్రీ1:3 [3-4] ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, లేక, ప్రతిబింబమును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
హెబ్రీ 1:5 ఏలయనగా – నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక –నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితో నైన ఎప్పుడైనను చెప్పెనా?
కొలస్సీయులకు 2:9 ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది.
కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. – బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. హెబ్రీ 10:5
దేవునికి, యేసుక్రీస్తుకు మధ్యగల సంబంధం ఈ లోకంలో ఉండే మానవులలో ఉండే తండ్రి, కుమారుల సంబంధం లాంటిది కాదు. ఎందుకంటే ఈ లోకం ప్రకారం, తండ్రికి ఉండే శక్తి , కుమారుడికి ఉండే శక్తి ఒకే విధంగా ఉండవు. తండ్రికి, కుమారుడికి మధ్య పోలికలు కొంతమందికి ఉండవచ్చు, కొందరిలో ఉండకపోవచ్చు. తండ్రి తెల్లగా ఉండవచ్చు, కొడుకు నల్లగా ఉండవచ్చు. తండ్రి పొట్టిగా ఉండవచ్చు, కొడుకు ఎత్తుగా ఉండవచ్చు.
కానీ పరలోకపు తండ్రి, కుమారుడు ఒకే విధంగా ఉంటారు. దేవుడు ఆత్మ గనుక యేసుక్రీస్తు కూడా ఆత్మయై యున్నాడు. అయితే దేవుడు యేసుక్రీస్తుకు ఒక శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకు పంపాడు.
తండ్రి అయిన దేవుడు కేవలం యేసుక్రీస్తును మాత్రమే ఈ విధంగా కన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే దేవుని జనితైక కుమారుడై యున్నాడు.
దేవుడు మిగిలిన సమస్త దూతలను, ప్రపంచాన్ని యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కోసం సృష్టించాడు. దేవుడు యేసుక్రీస్తును సమస్త సృష్టికి ప్రభువుగా చేసియున్నాడు.
ఉదాహరణకు దేవుడు ఆదాము కోసం ఈ భూమిని ఇందులో ఉండే సమస్తమును సృష్టించి ఆదాముకు అప్పగించాడు.
ఈ భూమి మీద ఉండే మొక్కలను, పక్షులను, జంతువులను దేవుడు తన ఆజ్ఞ ద్వారా సృష్టించి యున్నాడు. కానీ మానవుడిని తన చేతులతో చేసి తనలో నుండి ఊపిరి ఊది సృష్టించాడు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద అధికారం ఆదాముకు ఇచ్చియున్నాడు.
అదే విధంగా తనలో నుండి స్వయంగా, సమానంగా కనిన యేసుక్రీస్తుకు దేవుడు సమస్త సృష్టిని అప్పగించాడు.