After2038.org
సమయం చాలా దగ్గరపడింది.
2024 నుండి మరో 14 సంవత్సరాలలో క్రీస్తు విరోధి ఈ భూమి మీద మూడున్నర సంవత్సరాలు అధికారం చెలాయించబోతున్నాడు. అప్పటిలోగా శ్రమల కాలం నుండి తప్పించుకోవాలనే క్రైస్తవులు మూడున్నర సంవత్సరాలకు సరిపడే ఆహారం, మంచినీరు సిద్ధపరచుకోవాలి.
ప్రస్తుతం 2024, నవంబర్ లో ఉన్నాము. మరొక నెల జరిగితే 13 సంవత్సరాల సమయమే ఉంటుంది. సమయం సమీపించింది గనుక ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో చాలా మంది క్రీస్తువిరోధి కాలానికి చేరుకోబోతున్నారు. ఆ శ్రమల కాలాన్ని దాటితే, దేవుని 1000 సంవత్సరాల రాజ్యములో ఉంటాము.
క్రీస్తు విరోధి అధికారంలో ఉండగా, క్రైస్తవులు మార్కెట్లో వస్తువులు కొనడం ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి సమయం ఉండగానే క్రైస్తవులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్లనే దేవుడు ప్రస్తుతం అభివృద్ధి కలిగిస్తున్నాడు.
ఈ భూమి మీద దేవుని రాజ్యమును స్థాపించడానికి క్రైస్తవులను, మిగిలిన ప్రజలను సిద్ధపరచడానికి సంబంధించిన వివరాలను ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను.
2 థెస్స 2:1 సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల 2 మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటనుబట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.
2 థెస్సs 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
2 థెస్స 2:4 ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
2 థెస్స 2:5 నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?
2 థెస్స 2:6 కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.
2 థెస్స 2:7 ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసివేయబడు వరకే అడ్డగించును.
2 థెస్స 2:8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ప్రకటన 12:5
ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను. ప్రకటన 12:6
ప్రకటన 12:7 అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా 8. ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.
ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితోకూడ పడద్రోయబడిరి.
ప్రకటన 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని–రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
ప్రకటన 12:13 ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను.
ప్రకటన 12:14 అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.