After2038.org

ఏడవ రోజు గురించి వాక్యంలో ఏమి వ్రాయబడింది?

మరియు –దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమును గూర్చి ఆయన యొకచోట చెప్పియున్నాడు. హెబ్రీ 4:4

ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో–నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.హెబ్రీ 4: 6,7

రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. కీర్తనలు 95:7

అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కీర్తనలు 95:8

అచ్చట మీపితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కీర్తనలు 95:9

నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి –వారు హృదయమున తప్పిపోవు ప్రజలువారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కీర్తనలు 95:10

కావున నేను కోపించి– వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. కీర్తనలు 95:11

యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. హెబ్రీ 4:8

కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. హెబ్రీ 4:9

ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును. హెబ్రీ 4:10

కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. హెబ్రీ 4:11