After2038.org

భ్యూమ్యాకాశములను సృష్టించిన తండ్రియైన దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే దేవుని కుమారులు నమస్కారాలు /వందనాలు చేయాలి.

దేవుని కుమారులు సాధారణ మనుష్యులకు గాని, అధికారులకు గాని, సంఘములోని విశ్వాసులకు గాని, క్రీస్తు విరోధికి గాని, దేవదూతలకుగాని నమస్కారాలు/ వందనాలు చేయకూడదు.

ఇందును గూర్చి వాక్యములో ఏమి వ్రాయబడి ఉంది?

1 వ వాక్యము

ప్రకటన 22:8 యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, 9 అతడు – వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

2వ వాక్యము

ప్రకటన 14:6 అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.7 అతడు– మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.

3వ వాక్యము

జెఫన్యా 2:11 జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవావారికి భయంకరుడుగా ఉండును.

ఈ మూడు వాక్యాల ద్వారా దేవుడికి మాత్రమే నమస్కారాలు/వందనాలు చేయాలి అని క్రైస్తవులైన దేవుని కుమారులందరూ అర్ధం చేసుకోవాలి. సామాన్య కైస్తవులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు.

ఈ అంత్యదినాలలో ఈ ముఖ్యమైన సమాచారం ఇండియాలో ఉన్న క్రైస్తవులకు తెలియజేయాలనే ఆలోచన, ప్రేరేపణ దేవుడు నాకు అనుగ్రహించాడు.

ఈ లోక అధికారులకు, ఈ లోక మనుష్యులకు నమస్కారం చేసే అలవాటు ఉన్నవారు, క్రీస్తు విరోధికి కూడా నమస్కారం చేసే అవకాశం ఉంటుంది గదా!

అధికారుల దగ్గర ఆయితే అవసరాల కోసం, మనుష్యుల దగ్గర అయితే మొహమాటం కోసం, ఇతరులతో తిరిగి నమస్కారం పెట్టించుకోవాడానికి సాధారణంగా ఇండియాలో జనాలు ఒకరికి ఒకరు నమస్కారాలు చేసుకుంటారు. అయితే క్రీస్తు విరోధి జనాలకు బాగా అలవాటై పోయిన నమస్కారం పెట్టే ఈ అలవాటునే తనకు నమస్కారం పెట్టించుకునే విధంగా వాడుకోబోతున్నాడు. అయితే ప్రకటన గ్రంథం ప్రకారం క్రీస్తు విరోధికి నమస్కారం చేయకూడదు. ఒకవేళ క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తే, వారు అగ్నిగుండంలో పడవేయబడతారు.

ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు–ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ప్రకటన 13:4

డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను లేక, నలువదిరెండు నెలలు ఉండుటకు దాని కధికారమియ్యబడెను. ప్రకటన 13:5

భూ నివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ప్రకటన13:8

ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ప్రకటన13:9

ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ప్రకటన 13:10

అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ప్రకటన 13:12

మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. ప్రకటన 13:15

ప్రకటన 14:9 మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను— ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారము చేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల 10 ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

ప్రకటన14:11 వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.౹

ప్రకటన 14:12 దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.